గురువారం, 24 ఏప్రియల్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవీ
Last Updated : గురువారం, 24 ఏప్రియల్ 2025 (10:16 IST)

మరో సినిమాకు రెడీ అయిన నందమూరి కళ్యాణ్ రామ్

Kalyan Ram
Kalyan Ram
నందమూరి కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీ ఫలితంతో సంబంధంలేకుండా వెంటనే మరో సినిమాకు సిద్ధమయ్యాడు. యాక్సన్ డ్రామా  చిత్రంగా తీసిన అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇందుకు రకరకాల కారణాలున్నా, ఇప్పుడు చేయబోయే సినిమాను పటాస్ తరహాలో ఎంటర్ టైన్ మెంట్ వేలో తీయాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు తెలియజేస్తున్నారు. కాగా,  గిరీశయ్య అనే డైరక్టర్ కళ్యాణ్ రామ్‌కు ఓ కథను చెప్పినట్లు తెలుస్తోంది. తమిళంలో ‘ఆదిత్య వర్మ’ అనే పేరుతో అర్జున్ రెడ్డిని రీమేక్ చేశాడు గిరీశయ్య.
 
ఇందులో యేరెగెంట్ గా వుండే పాత్రను కళ్యాణ్ రామ్ కు డిజైన్ చేసినట్లు సమాచారం. కానీ పూర్తి వినోదం కలిగేలా కథను మార్చమని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు యాక్షన్ ఎలిమెంట్లతో మరో కథను కూడా  ఇంకో దర్శకుడు కథను తీసుకువచ్చినట్లు సమాచారం. గతంలో బి.గోపాల్ దగ్గర పనిచేసినట్లుగా తెలియవచ్చింది. కానీ ఆ కథను కూడా తర్వాత చేద్దామని అన్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగా కామెడీ సినిమా చేయాలని ఆలోచనలో వున్నట్లు ఫిలింనగర్ కథనాలు వినిపిస్తున్నాయి.