గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (21:16 IST)

చిట్టీల పేరు మోసం.. ఏకంగా రూ.4కోట్లతో పరారైన దంపతులు ఎక్కడ?

చిట్టీల పేరుతో మోసాలు ఈ మధ్య పెద్దగా కనిపించకపోయినా.. మళ్లీ అలాంటివి వెలుగులోకి వస్తున్నాయి. చిట్టీలను ప్రజలు నమ్మి మోసపోతున్నారు. తాజాగా చిట్టీల పేరుతో ప్రజల వద్ద భారీగా డబ్బులు వసూలు చేసి సుమారు రూ.4కోట్లకు వారికి కుచ్చుటోపీ పెట్టి పారిపోయారు దంపతులు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ చిట్టీల వ్యాపారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు 35 వార్డులో చిట్టిల పేరుతో నాలుగు కోట్లు వసూలు చేసి లక్ష్మణరావు, సత్యవతి దంపతులు పరారైనారు. అప్పటివరకు ఉన్న దంపతులు కనిపించకపోవడంతో బాధితులు లబోదిబోమంటూ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇంకా లక్ష్మణరావు దంపతుల ఫోన్లు స్విచ్ఛాఫ్ కావడంతో చిట్టీలు కట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. 
 
లక్ష్మణరావు దంపతుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, బంధువుల ఇళ్ల దగ్గర కూడా లేకపోవడందో వారిద్దరూ పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు. అనంతరం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల వద్ద జరిపిన విచారణలో అందరి వద్ద కలిపి సుమారు రూ.4కోట్ల వరకు చిట్టీలు వసూలు చేసినట్లు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.