మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జులై 2020 (16:22 IST)

కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం.. పెళ్లికి తర్వాత రెండు నెలలకే..?

ఫేస్‌బుక్ పరిచయంతో ఓ యువతి మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా తిమ్మాపురంకి చెందిన కాశి అనే యువకుడు రాంనగర్‌కు చెందిన జ్యోతి అనే యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. మొదట ఆమెతో స్నేహం చేసి తర్వాత ప్రేమలోకి దించాడు. అనంతరం అతడిని నమ్మిన జ్యోతి పెళ్లి చేసుకుంది.
 
పెళ్లికి తర్వాత రెండు నెలల తర్వాత అసలు రంగు బయటపడింది. పెళ్లికి తర్వాత రెండు నెలలకే కట్నం తీసుకురావాలని కాశి అతడిని వేధించటం పెట్టాడు. దాంతో లైంగికంగా వాడుకుని వదిలేయడంతో తనకు న్యాయం చేయాలని జ్యోతి హెచ్చార్సీని వేడుకుంది. 
 
తమ కుటుంబం కట్నం ఇవ్వలేకపోవడంతో తనని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై దోర్నాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.