మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 జులై 2020 (20:05 IST)

కరోనాతో మృతి చెందితే అంత్యక్రియల కోసం రూ.15వేలు.. సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కరోనా మృతులకు సంబంధించి కొత్త ప్రకటన చేశారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా కరోనాతో మృతిచెందితే అంత్యక్రియల కోసం బాధిత కుటుంబానికి రూ.15వేలు ఇవ్వాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. కరోనా బాధితులను నిరాకరించే ఆస్పత్రుల రద్దుకు వెనుకాడవద్దని అధికారులకు సూచించారు.
 
రాష్ట్రంలో 17వేల మంది వైద్యులు, 12వేల మంది నర్సులను భవిష్యత్‌ అవసరాల కోసం నియమిస్తామని సీఎం జగన్‌ తెలిపారు. క్వారంటైన్‌ కేంద్రాలు, వసతులు, భోజనం తదితర వాటిపై ప్రత్యేక దృష్టిని సారించాలని అధికారులకు సూచించారు.
 
వచ్చే వారం రోజులు ఆస్పత్రులపై స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. క్రమం తప్పకుండా ఆస్పత్రులను సందర్శించాలన్నారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లల్లో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరోనా పరీక్ష కేంద్రాలను శాశ్వత పరీక్షల కేంద్రంగా మార్చాలని వెల్లడించారు.