సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (17:36 IST)

అనుమానంతో ప్రేయసి గొంతు కోసిన ప్రేమికుడు

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అతిగా ప్రేమించడం వల్ల అది కాస్త అనుమానంగా మారి ఫలితంగా హత్యకు దారి తీసింది. ప్రియురాలి మీద అనుమానంతో ఆమెపై దాడి చేయడమే కాకుండా అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు ఓ ఉన్మాది ప్రియుడు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తెనాలికి చెందిన సత్యనారాయణ, జ్యోతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అంతేకాకుండా వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సత్యనారాయణకు జ్యోతిపై ఉన్న ప్రేమ అనుమానంగా మారింది. ఆమెపై అనుమానం పెరిగిపోవడంతో అతడు విచక్షణ కోల్పోయాడు. 
 
గురువారం జ్యోతిపై దాడికి పాల్పడి, కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసాడు. ఆ తర్వాత తానే జ్యోతిని హత్య చేసినట్లు చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.