బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (08:46 IST)

కోర్టుకు రావాలంటూ ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌కు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోమారు కబురుపంపింది. కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయన్నపాత్రుడు ఓ వివాహానికి హాజరయ్యారు. ఇలా హాజరుకావడం లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ వారిద్దరిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పైగా, మరికొందరు వివాహాలు జరుపుకునేలా ప్రోత్సహించారని కూడా ఆరోపిస్తూ దానిపై కూడా మరో కేసును నమోదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయలతో పాటు.. ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కోర్టు స్టే ఆర్డర్ జారీచేసింది. 
 
అంతేకాకుండా, ఈ వివాహానికి హాజరైన మరికొందరు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి తమ వాహనాలను సీజ్ చేశారంటూ పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు.. ఏపీ హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను నేరుగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది.