శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 22 జనవరి 2017 (13:28 IST)

హిరాఖండ్ రైలు ప్రమాదం వెనుక మావోల హస్తం.. 36కు చేరిన మృతులు

విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడం వెనుక మావోయిస్టుల కుట్ర ఉన్నట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు పట్టాలు తప్పిన ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ఏరియా కావడంతో ఇలా అనుమాన

విజయనగరం జిల్లాలో హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడం వెనుక మావోయిస్టుల కుట్ర ఉన్నట్టు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ రైలు పట్టాలు తప్పిన ప్రాంతం మావోయిస్టు ప్రభావిత ఏరియా కావడంతో ఇలా అనుమానించాల్సి వస్తోంది. పైగా రైలు పట్టా విరిగిపడివుంది. ఎవరైనా ఏదేని దుశ్చర్యకు పాల్పడటం వల్లే ఈ రైలు పట్టా విరిగిపోవడం జరుగుతుందని రైల్వే అధికారులు చెపుతున్నారు. 
 
మరోవైపు ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 36కు చేరింది. మరో 54 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులు విశాఖ, కేజీహెచ్, పార్వతీపురం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జగదల్‌పూర్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ విజయనగరం జిల్లా కొమరాడ మండలం, కూనేరు స్టేషన్ వద్ద శనివారం అర్థరాత్రి పట్టాలు తప్పిన విషయంతెల్సిందే. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
ఈ రైలు ప్రమాదం వెనుక కుట్ర దాగున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమని రైల్వే అధికారులు అన్నారు. ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ అనుమానాలకు అవకాశం వచ్చింది. గణతంత్ర్య దినోత్సవం దగ్గరపడుతున్నందున నక్సల్స్ తమ ఉనికిని చాటుకునేందుకు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.