శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (09:07 IST)

బావతో వివాహేతరసంబంధం... అడ్డొస్తున్నాడనీ భర్తను ఏం చేసిందో తెలుసా?

వివాహేతర సంబంధంమాయలో పడిన ఓ భార్య.. కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ దారుణం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

వివాహేతర సంబంధంమాయలో పడిన ఓ భార్య.. కట్టుకున్న భర్తనే తన ప్రియుడితో కలిసి కడతేర్చింది. ఈ దారుణం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని రామగిరి మండలం ఏడు గుర్రాలపల్లి చెందిన శివయ్య అనే వ్యక్తి ధర్మవరంలో రంగుల అద్దకం పరిశ్రమలో పనిచేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నాడు. ఈయనకు భార్య అశ్విని ఉంది. ఈమె తన సమీప బంధువు, వరుసకు బావ అయిన ఆంజనేయులుతో అక్రమసంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకుని భార్యను భర్త పలుమార్లు హెచ్చరించాడు. అంతేకాకుండా, భార్యను ఓ కంట కనిపెట్టాడు. 
 
ఈ క్రమంలో భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన అశ్విని.. తన ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది. ఈ కుట్రలో భాగంగా, ఈ నెల 10వ తేదీ రాత్రి శివయ్యను బెంగళూరు ఎయిర్‌ పోర్టు వరకూ వెళ్లి వస్తామని శివయ్యను ప్రియుడు ఆంజనేయులు కారులో తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో శివయ్యకు మద్యం తాపాడు. అనుకున్న ప్రకారం హత్య చేసి రాళ్ల మధ్యలో శవాన్ని పడేశారు. 
 
దీనిపై అనుమానాస్పద కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, అశ్విని, ఆంజనేయులు ప్రవర్తనను సందేహించిన పోలీసులు.. ఆంజనేయులుని అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది.