బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2017 (09:35 IST)

ప్రేమ పేరుతో మోసం.. మొబైల్ ఫోనులో నగ్నంగా ఫోటోలు తీసి..?

ప్రేమ పేరుతో యువతులకు గాలం వేసి మోసాలకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెంకు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతుల్ని ముగ

ప్రేమ పేరుతో యువతులకు గాలం వేసి మోసాలకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెంకు చెందిన యువకుడు ప్రేమ పేరుతో యువతుల్ని ముగ్గులోకి దింపుతున్నాడు. వారిని నగ్నంగా ఫోనులో చిత్రీకరించి, ఆపై వారి నుంచి డబ్బు డిమాండ్‌కు పాల్పడ్డాడు. ఇలా దాదాపు 15 మంది యువతుల్ని మోసం చేసినట్లు సమాచారం. బాధితుల్లో చాలామంది కళాశాల విద్యార్థినులే ఉన్నారని విచారణలో వెల్లడి అయ్యింది. 
 
ఇదిలా ఉంటే.. హైదరాబాదులో భార్యను భర్త హతమార్చాడు. వివరాల్లోకి వెళితే ఈస్ట్‌ మారేడ్‌పల్లి సెయింట్‌ జోసఫ్‌ సెకండరీ స్కూల్‌లో సూర్యనారాయణ మూడేళ్లుగా వాచ్‌మన్‌గా పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. అతడి అల్లుడు వీరబాబు, చెల్లెలు వెంకటలక్ష్మి, ఆమె భర్త శివశంకర్‌ రాజమండ్రి నుంచి ఆదివారం ఉదయం సూర్యనారాయణ ఇంటికి వచ్చారు. ఏమైందో ఏమో కానీ భార్యను భర్త హతమార్చి పరారైనాడు.