గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 జూన్ 2019 (08:57 IST)

పెళ్లికి ముందు పరిచయం.. పెళ్లైనా వదలక వేధింపులు.. కత్తితో పొడిచి..?

వివాహితను వివాహం చేసుకోవాలని వేధించాడు. ఆమె కాదనడంతో.. ఇంటికొచ్చి మరీ కత్తితో దాడి చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే... పెళ్లికి ముందు ఓ మహిళతో ఏర్పడిన పరిచయాన్ని ఆసరాగా తీసుకుని తనను ప్రేమించాలంటూ ఓ ప్రబుద్ధుడు వివాహితను వేధించసాగాడు. ఆమె ససేమిరా అనడంతో ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
ఫిలింనగర్‌లోని వినాయకనగర్‌లో నివసించే మహిళ (26)కు టోలీచౌకి ప్రాంతానికి చెందిన ఆసిఫ్ (24)తో పరిచయం అయింది. ఆ తర్వాత ఆమెకు మరో వ్యక్తితో వివాహమైంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ కొద్దిరోజులుగా ఆమెను ఆసిఫ్ పెళ్లి చేసుకోవాలని వేధించాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు అతడిని నిలదీశారు. అయినప్పటికీ వేధింపులు ఆపని ఆసిఫ్ తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడుతూనే ఉన్నాడు.
 
ఆమె నిరాకరించడంతో సోమవారం రాత్రి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడిచేశాడు. మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఆరు నెలల క్రితమే వివాహమైందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన మహిళ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.