శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (16:42 IST)

ఏనుగు విగ్రహం కాళ్ల మధ్య దూరిన మహిళ..అలా ఇరుక్కుపోయింది... వైరల్ వీడియో

ఫోటో కోసం ఫోజిచ్చింది. తర్వాతే ఆమెకు చుక్కలు కనిపించాయి. ఆలయానికి వెళ్ళామా.. దేవుడిని దర్శించామా అని లేకుండా.. ఓ చిన్నపాటి ఏనుగు బొమ్మ కాలి మధ్య దూరింది.


అంతే అదే ఆమెకు ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఇంకా పిచ్చపిచ్చగా కామెంట్లు చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఓ మహిళ కొద్దిరోజుల క్రితం ఓ గుడికి వెళ్లింది. ఈ సందర్భంగా గుడిలో ఉన్న ఏనుగు బొమ్మతో ఫొటో దిగాలనుకుందామె. అయితే అందరిలాగా ఫొటో దిగితే ఏం వెరైటీ అనుకుందో ఏమో కానీ.. ఏనుగు బొమ్మ కిందకు అతికష్టం మీద దూరింది. అనంతరం తన స్టైల్లో ఫొటోకు ఫోజిచ్చింది. అంతే ఏనుగు కాళ్ల మధ్యలోనే చిక్కుకుపోయింది. 
 
ఇక ఆ ఏనుగు విగ్రహం కాళ్ల మధ్యలోకి చిక్కుకున్న ఆమెను అక్కడున్న మహిళలు ముందు వెనకా తోసి బయటికి లాగారు. ముందు నుంచి కొందరు లాగడం వెనక నుంచి కొందరు ఆమెను తోయడంతో కొద్ది నిమిషాల తర్వాత ఆమె విగ్రహం నుంచి బయటపడింది. 
 
ఈ వీడియోను ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోపై కామెంట్లు పేలుతున్నాయి. షేర్లు వెల్లువెత్తుతున్నారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.