గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (13:01 IST)

ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచారం చేసిన ఎలక్ట్రీషియన్

ఉద్యోగం పేరుతో ఓ మహిళపై ఎలక్ట్రీషియన్ అత్యాచారనికి తెగబడ్డాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇరగవరం మండలం, పేకేరు గ్రామానికి చెందిన వెంకట నరసింహ మూర్తి (41) అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పైగా, ఆ ప్రాంత వాసులకు తాను ఓ ఏజెంట్ అంటూ పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం మస్కట్, దుబాయ్ వంటి ప్రాంతాలకు నిరుద్యోగులను పంపిస్తున్నట్టు నమ్మబలికాడు. 
 
అతని మాటలను అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ (35) నమ్మింది. తనను మస్కట్‌కు పంపించాలని కోరింది. దీంతో ఈ నెల 18వ తేదీ ఆ మహిళతో పాటు మరో మహిళను చెన్నైకు తీసుకొచ్చాడు. కానీ, మస్కట్‌కు టిక్కెట్ దొరకలేదని చెప్పి... తన వెంట వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరిని తిరిగి ఆంధ్రాకు పంపించేశాడు. 
 
ఈ మహిళను మాత్రం తన వెంట ఉంచుకున్నాడు. ఆ తర్వాత చెన్నైలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని అక్కడ రెండు రోజుల పాటు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవని, అందువల్ల ఇపుడు మస్కట్‌కు వెళ్లడం కుదరని చెప్పి ఈ నెల 22వ తేదీన చెన్నై నుంచి సికింద్రాబాద్‌కు చేరుకున్నారు. అక్కడ మరో లాడ్జీలో దిగి... మరోమారు అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ ప్రాధేయపడ్డాడు. 
 
అయితే, బాధితురాలు మాత్రం... డబ్బుతో శీలం కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురై... నేరుగా పోలీసుకు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.