ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 22 జూన్ 2019 (16:51 IST)

ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్....

తమిళనాడు రాష్ట్రం విల్లుప్పురంజిల్లా పల్లిచ్చేరిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి ఎదుటే నలుగురు యువకులు ప్రియురాలిని అత్యాచారం చేశారు. ఆలస్యంగా ఈ దారుణం వెలుగు చూసింది. కండమంగళం ప్రాంతానికి చెందిన యువతి, సూరమంగళానికి చెందిన ఓ యువకుడు నల్లూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వారు నల్లూరు రైల్వే గేట్ వద్ద పల్లిచ్చేరి మైదాన ప్రాంతంలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ ప్రాంతానికి సమీపంలో నలుగురు యువకులు మద్యం తాగుతున్నారు.
 
ప్రేమ జంట ఒంటరిగా ఉండడాన్ని చూసి వారి దగ్గరకు వచ్చారు. దీంతో ప్రేమికులిద్దరూ అక్కడి నుంచి వెళ్ళేందుకు ప్రయత్నించారు. కానీ వారిని చుట్టుముట్టి ప్రియుడిపై దాడి చేశారు. అతడి కళ్ళ ముందే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయిన బాధితుడు సెల్ ఫోన్లో స్నేహితుడికి సమాచారం అందించారు. అతను వచ్చిన వెంటనే వారిద్దరూ కలిసి ఆ నలుగురు యువకులను ఎదిరించారు.
 
వారు మరోసారి దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు. ఆ మార్గాన వెళుతున్న కొందరు స్థానికులు యువతి గాయాలతో స్పృహతప్పి పడిపోయి ఉండటం గమనించి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. నిందితుల్లో ఒకరైన అయ్యనాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.