సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (17:06 IST)

హీరో నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కుళ్ళిన మృతదేహం

హైదరాబాద్ నగరంలో షాద్‌నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలో హీరో అక్కినేని నాగార్జున వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ కుళ్లిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించారు. పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున.. ఈ నెల పదో తేదీన వ్యవసాయ కేత్రంలో చెట్టు నాటిన నాగార్జున భార్య అమల... వ్యవసాయ కేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
వ్యవసాయ సాగుపైన నిపుణులను పంపిన నాగార్జున కుటుంబ సభ్యులు, ఈ నిపుణులు పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. అలాగే, మృతదేహం లభించిన గదిని సీజ్ చేశారు. ఈ మృతదేహం ఎవరిది? ఎందుకు హత్య చేశారన్న కోణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.