శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 జులై 2017 (12:48 IST)

నా నగ్న ఫోటోలు పంపుతున్నా.. వాటిని ఎవరికైనా విక్రయించి 'డ్రగ్స్' కొనివ్వరా... ప్లీజ్

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్ దందా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మత్తుకు అలవాటుపడిన ఓ యువతి ఏకంగా తన నగ్న ఫోటోలను పంపించింది. వాటిని ఎవరికైనా విక్రయించి... వచ్చిన డబ్బుతో ఎంతవస్తే అ

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్ దందా ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. మత్తుకు అలవాటుపడిన ఓ యువతి ఏకంగా తన నగ్న ఫోటోలను పంపించింది. వాటిని ఎవరికైనా విక్రయించి... వచ్చిన డబ్బుతో ఎంతవస్తే అంత మత్తుమందు కొనివ్వాలంటూ డ్రగ్స్ కేసులో సూత్రధారిని ప్రాధేయపడిన విషయం వెలుగులోకి వచ్చింది. 
 
హైదరాబాద్‌లో డ్రగ్స్ దందాను యధేచ్ఛగా సాగిస్తూ వచ్చిన కొందరు దుర్మార్గుల దాష్టీకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో వందల కొద్దీ వాట్సప్ గ్రూపులుండగా, వాటిల్లోని విషయాలు పోలీసులనే షాకింగ్‌కు గురిచేస్తున్నాయి. 
 
ఓ గ్రూప్‌లోని వీడియో ఒకటి ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఓ యువతి, తనకు మత్తుమందులు కావాలని కోరుతూ, డబ్బులు లేవని, తన నగ్న వీడియో పంపుతున్నానని, వాటిని ఎవరికైనా విక్రయించి, ఆ వచ్చిన డబ్బుకు ఎంత వస్తే అంత మత్తుమందు ఇవ్వాలని కోరిన యువతి మెసేజ్‌ని చూసి పోలీసు ఉన్నతాధికారులు ఖంగుతిన్నారు. 
 
డ్రగ్స్‌కు బానిసలుగా వేలాది మంది మారిపోయారని, పెద్ద పెద్ద హోటళ్లు, ఐటీ కంపెనీలు, చిత్ర పరిశ్రమల్లోని వ్యక్తులు సైతం కస్టమర్లుగా ఉన్నారని, ఇది అతి పెద్ద కేసుగా భావిస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ ఫౌర్స్ మెంట్ డైరెక్టరేట్ అకున్ సబర్వాల్ వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, విద్యార్థులకు కొత్త తరహాలో కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేసే వాడని, కిట్టీ పార్టీల పేరుతో ధనవంతుల పిల్లలకు విందులు ఇచ్చేవాడని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పార్టీకి వచ్చిన పిల్లలు, విద్యార్థులకు డ్రగ్స్ రుచి చూపించిన కెల్విన్, ఏడాదిగా పలు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసినట్టు తేలింది.
 
డ్రగ్స్‌కు అలవాటైన పిల్లలతోనే అమ్మకాలు జరిపించేవాడని, సినీ పరిశ్రమలో పని చేసే వారికి మధ్యవర్తుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేసేవాడని తెలిపారు. డ్రగ్స్‌కు అలవాటుపడ్డ పిల్లలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు అధికారులు చెప్పారు. 
 
మరోవైపు... డ్రగ్స్ దందాలో పోలీసులు మరింత మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అరెస్టయిన వారిలో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుడు కూడా ఉన్నారు. అతనితో పాటు దీపక్, అబ్దుల్ అనే ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి నుంచి 16 డోసుల ఎల్ఎస్డీ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసు వర్గాలు సమాచారమిచ్చాయి. తాజా అరెస్టులతో ఈ కేసులో మొత్తం 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయింది.