శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (11:54 IST)

జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident
హైదరాబాద్ చందానగర్ జేపీ సినిమాస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారికి అనుకొని ఉన్న కపాడియా షాపింగ్ మాల్ లోని ఐదవ అంతస్థులో ఉన్న జేపీ సినిమాస్‌లో ఉదయం ఆరు గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
జేపీ సినిమాస్‌లోనే ఐదు స్క్రీన్‌లు, ఫర్నీచర్ దగ్ధమైంది. స్కైలిఫ్టర్, నాలుగు ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. 
 
షాపింగ్ మాల్‌కు ఫైర్ ఎన్ఓసీ లేదని జీహెచ్ఎంసీ (జీహెచ్ఎంసీ) అధికారులు చెప్తున్నారు. అనుమతులు లేకుండానే జేపీ సినిమాస్ యాజమాన్యం సినిమాలు నడిపిస్తోందని తెలుస్తోంది.