బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 1 మే 2017 (09:21 IST)

హైదరాబాద్ టెక్కీ సూసైడ్‌కు కారణమిదే.... బ్రోకర్ భర్త వేధింపులు భరించలేకే

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ బ్రోకర్ అయిన కట్టుకున్న భర్త పెట్టే వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

హైదరాబాద్ టెక్కీ ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టాక్ బ్రోకర్ అయిన కట్టుకున్న భర్త పెట్టే వేధింపులు, అవమానాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో వినీత అనే వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతానికి చెందిన సుబ్బారావు - ఉదయలక్ష్మి కూతురు వినీత (33). ఆరేళ్ల కిందట విక్రమ్‌ జైసింహతో వినీత వివాహం జరిగింది. ఆ సమయంలో అల్లుడికి కట్నకానుకల కింద రూ.2 లక్షలు ఇచ్చారు. వీళ్లిద్దరు హైదరాబాద్ చందానగర్‌లోని అరుణోదయ రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో వుంటున్నారు. వీరికిద్దరు పిల్లలు కూడా ఉన్నారు 
 
వినీత హైదరాబాద్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్‌ ఎనలిస్టుగానూ, భర్త విక్రమ్‌ మాత్రం స్టాక్‌ బ్రోకర్‌గా పని చేస్తున్నారు. అయితే, పెద్దగా సంపాదన లేని భర్త... భార్యపై ఆధారపడ్డాడు. ఈ క్రమంలో తరచూ జీతానికి సంబంధించిన వివరాలు అడిగుతూ.. అదనపు కట్నం కోసం భార్యని కొంతకాలంగా వేధించసాగాడు. ఇవి మరింత హద్దుమీరిపోవడంతో భర్త వేధింపులు భరించలేక మనస్తాపం చెందింది. 
 
ఈ క్రమంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో విక్రమ్‌ తన కూతురుని బయటకు తీసుకెళ్లాడు. భర్త ఇంటికి వచ్చేలోపు వినీల ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించింది. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.