శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (16:53 IST)

ముచ్చటగా మూడో పెళ్ళి.. ఫోన్ కాల్ కొంపముంచింది.. భర్తను కిరోసిన్ పోసి నిప్పంటించింది.. ఆపై..?

ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. కానీ ఓ ఫోన్ కాల్ ఆ దంపతుల ప్రాణాలు తీసింది. భర్తపై అనుమానంతో భార్య కిరోసిన్ పోసి హతమార్చి.. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ముచ్చటగా మూడో వివాహం చేసుకున్నారు. కానీ ఓ ఫోన్ కాల్ ఆ దంపతుల ప్రాణాలు తీసింది. భర్తపై అనుమానంతో భార్య కిరోసిన్ పోసి హతమార్చి.. ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అంగడి చింతపల్లి గ్రామానికి చెందిన బర్లపల్లి జంగయ్య భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతనికి రెండుసార్లు పెళ్లైంది. 
 
ఇతడి ఇద్దరు భార్యలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. మూడోసారి ముచ్చటగా సావిత్రి అనే మహిళను ఏడాది క్రితమే చేసుకున్నాడు. ఆమెకూ ఇది మూడో వివాహమే. తన భర్తలతో దూరంగా ఉంటూ మూడోసారిగా జంగ్గయ్యను పెళ్ళాడిన సావిత్రి కూడా భర్తతోనే పనిచేస్తోంది. కానీ రెండో భర్తతో కలిగిన సంతానంగా సావిత్రికి 17ఏళ్ల వయస్సున్న కుమార్తె వుంది. ఆమె మానసిక స్థితి సరిగ్గాలేదు. 
 
ఈ నేపథ్యంలో సావిత్రి, జంగయ్య దంపతులకు మూడు మాసాల క్రితమే కొడుకు పుట్టాడు. అయితే శనివారం రాత్రి పూట మద్యం తాగి వచ్చిన జంగయ్య నిద్రపోయే సమయానికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫోన్ కాలే వారి కుటుంబంలో చిచ్చుపెట్టింది. జంగయ్యకు వచ్చిన ఫోన్‌కాల్‌లో ఓ మహిళ మాట్లాడింది. అంతేగాకుండా ఆ ఫోన్‌లో ఇంటిబయటికొచ్చి అతను మాట్లాడాడు. 
 
ఫోన్‌కాల్‌లో ఎవరని భర్తను భార్య నిలదీసింది. దీంతో తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. సుమారు గంటపాటు ఇద్దరూ కూడ గొడవపడ్డారు. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని భార్య సావిత్రి అనుమానించింది. గంట తర్వాత భర్త నిద్రపోగానే కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఆపై భర్త చనిపోయాడనే బాధతో సావిత్రి కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో దంపతులు తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.