శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 10 మే 2017 (10:45 IST)

'సినిమా నటుడు అంటున్నారు.. పవన్‌ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు': అశోక్ గజపతి

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సినిమా నటుడు అంటున్నారు.. నేను సినిమాలు చూసి చాలాకాలమైంది'' అని అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై కేంద్ర మంత్రి అశోకగజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''సినిమా నటుడు అంటున్నారు.. నేను సినిమాలు చూసి చాలాకాలమైంది'' అని అశోక్‌ గజపతిరాజు వ్యాఖ్యానించారు. 
 
గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలకు పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోక్ గజపతి అనడం సంచలనంగా మారింది. ఈ మేరకు అశోక గజపతిరాజు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. 
 
కాగా, టీడీపీ పాలనతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న తప్పొప్పులపై పవన్ కళ్యాణ్ నిలదీస్తున్న విషయం తెల్సిందే. తాజాగా, తితిదే కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై కూడా పవన్ ఏపీ సర్కారును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గజపతి రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.