1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (10:33 IST)

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి.. విస్తారంగా వర్షాలు: వాతావరణ శాఖ

రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతు రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఆనవాయితీ కంటే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను ముందుగా

రెండు తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతు రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఆనవాయితీ కంటే నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను ముందుగానే పలకరించాయని తెలిపారు. ఈ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వీటి కదలికలను బట్టి చూస్తే రానున్న మూడు లేదా నాలుగు రోజులపాటు ఇవి విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. 
 
పశ్చిమ దిశ, నైరుతీ దిశ నుంచి వీచే గాలుల తీవ్రత కారణంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే ఐదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వారు చెప్పారు. 
 
అలాగే, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని కలుపుతూ ఒడిశా నుంచి ఉత్తరకోస్తా మీదుగా సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 3.6 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అండమాన్‌ సముద్రాన్ని కలుపుతూ సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో మరొక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది.