మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 29 నవంబరు 2016 (16:37 IST)

రూ.2000 చిల్లర దొరకలేదని ఆత్మహత్యా యత్నం... కర్నూలులో...

పెద్దనోట్ల రద్దు సామాన్యులకు నరకం చూపిస్తోంది. పాతనోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే వారు రూ. 2000 నోట్లను చేతుల్లో పెడుతున్నారు. కనీసం ఒక నోటుకైనా చిల్లర ఇవ్వండయ్యా బాబూ అని అడుగుతున్నా బ్యాంకు సిబ్బంది మొండిచేయి చూపుతున్నారు. తమకు చిల్లర నోట

పెద్దనోట్ల రద్దు సామాన్యులకు నరకం చూపిస్తోంది. పాతనోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే వారు రూ. 2000 నోట్లను చేతుల్లో పెడుతున్నారు. కనీసం ఒక నోటుకైనా చిల్లర ఇవ్వండయ్యా బాబూ అని అడుగుతున్నా బ్యాంకు సిబ్బంది మొండిచేయి చూపుతున్నారు. తమకు చిల్లర నోట్లు రాలేదని చెప్పేస్తున్నారు. దీనితో రూ. 2000 నోట్లను తీసుకుని వచ్చినవారికి ఏది కొనాలన్నా గగనమే అవుతుంది.
 
కొనేందుకు రూ.2000 నోటిస్తే తమ వద్ద చిల్లర లేదని దుకాణాదారులు చెపుతున్నారు. కర్నూలులో ఓ రైతు రూ.2000 నోటు పట్టుకుని గత ఐదు రోజులుగా చిల్లర కోసం వివిధ ప్రాంతాల్లో తిరిగినా చిల్లర దొరకలేదు. దీంతో మనస్థాపం చెందిన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.