ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 1 మార్చి 2017 (08:35 IST)

వారసత్వ రాజకీయాలు తప్పనిసరి కావచ్చు. ఇలాగైతే ఎలా లోకేశ్ బాబూ!

కన్నతండ్రే తనను ఏపీ శాసనమండలి సభ్యుడిగా ప్రకటించడం ద్వారా ఊగిసలాటలు మాని లోకేశ్ తెరవెనుక రాజకీయాలనుంచి బయటకు వచ్చారు. కానీ భవిష్యత్ ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రచారమవుతున్న లోకేశ్ బాబు నేరుగా పోటీ చ

మొత్తం మీద లోకేశ్ బాబు ప్రభుత్వ అధికార స్వీకరణలో తొలి దశను చేరుకున్నారు. కన్నతండ్రే తనను ఏపీ శాసనమండలి సభ్యుడిగా ప్రకటించడం ద్వారా ఊగిసలాటలు మాని లోకేశ్ తెరవెనుక రాజకీయాలనుంచి బయటకు వచ్చారు. కానీ భవిష్యత్ ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రచారమవుతున్న లోకేశ్ బాబు నేరుగా పోటీ చేయడం ద్వారా కాకుండా దొడ్డి దారి ద్వారా అధికార రాజకీయాల్లోకి రావడం బలమా, బలహీనతా అనే చర్చ అప్పుడే మొదలైపోయింది. తెలంగాణలో కేసీఆర్ వారసులు తొలినుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజసంగానే అధికారిక స్థానాలను బలపర్చుకున్న చరిత్రను గమనిస్తే లోకేశ్ పంధా సరైందేనా అని అనుమానాలు కలుగుతున్నాయి. 
 
రాజకీయాల్లో, అందునా ప్రాంతీయ రాజకీయాల్లో కొడుకులూ కూతుళ్లు తమ తండ్రుల బాట పట్టడం కొత్తేమీ కాదు. పొరుగు రాష్ట్రం తెలంగాణ లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పిల్లలు ఇద్దరూ క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. కూతురు పార్లమెంట్‌ సభ్యురాలు, కాగా కొడుకు ఆయన క్యాబినెట్‌లోనే మంత్రి. దానికీ విమర్శలు వస్తు న్నాయి. అయితే తెలంగాణ  రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ తుది విడత పోరాటంలో ఆ ఇద్దరు పిల్లలూ చురుకయిన పాత్ర పోషించారు. ప్రజా మోదం పొంది గెలిచి వచ్చారు. కాబట్టి చంద్రశేఖరరావు ఆ విమర్శలను తట్టుకోగలుగుతున్నారు.
 
ఇట్లా చాలా రాష్ట్రాల్లో అధినేతల పిల్లలు రాజకీయా ల్లోకి వచ్చి తమ తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగించడం భారతదేశ ప్రాంతీయ రాజకీయాల్లో మామూలే. అయితే చాలా వరకు ప్రజాక్షేత్రంలో పోటీకి నిలబడి గెలిచి, రాజకీయాల్లో కొనసాగేవారే ఎక్కువ. కొందరు ఆ నమ్మకం లేక దొడ్డిదారిన కూడా ప్రవేశిస్తుంటారు. ఇప్పుడు నారా లోకేశ్‌ కూడా అదే దారిలో రాజకీయ ప్రవేశం చెయ్యబోతున్నారు.
 
యువకులు రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో కొత్త ఒరవడికి దోహదపడాలి. లోకేశ్‌ కూడా యువకుడే. రాజకీయాల్లో కొనసాగడానికి సుదీర్ఘ జీవితం ముందు ఉన్నది. తొలి అడుగే దొడ్డి దారిన పడటం ఆయనకు ఏ మాత్రం శోభ తెచ్చి పెడుతుందో ఆయనే ఆలోచించుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, కానీ ఎట్లా వచ్చాం, ఎంత కాలం ఉన్నాం, ఎటువంటి పేరు తెచ్చుకున్నాం అన్నది ముఖ్యం. 
 
లోకేశ్‌కు ఏ పదవి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది  తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఎవరైనా దీనిపై మాట్లాడాల్సింది పెద్దగా ఏమీలేదు. కానీ రాజకీయాల్లో తనను వ్యతిరేకించే వాళ్లే ఉండకూడదు, ప్రతిపక్షం లేకుండా చేసేయాలన్న ఆలోచన గల చంద్రబాబునాయుడు సొంత కొడుకునే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయించి గెలి పించుకోలేక దొడ్డి దారిన అధికారంలో భాగస్వామిని చేయబూనుకోవడం ఏమిటనే చర్చ మాత్రం ఇప్పుడు ప్రబలంగా సాగుతోంది. దీనికి జవాబు చెప్పేది ఎవరు?