బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 మార్చి 2021 (10:22 IST)

నేడు ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న జగన్

కర్నూలు విమానాశ్రయం నుంచి...ప్రయాణికుల విమాన రాకపోకలకు రంగం సిద్ధమవుతోంది. ఉడాన్‌ పథకంలో భాగంగా ఇండిగో సంస్థ తమ సర్వీసులను ఈనెల 28 నుంచి ప్రారంభించనుంది.

కర్నూలు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నైకు..విమాన సేవలు మొదలుపెట్టి సర్వీసులు విస్తరించనున్నారు. ప్రయాణికుల రాకపోకలకు తగ్గట్లు..సకల సౌకర్యాలతో విమానాశ్రయం ముస్తాబైంది. నూతన సాంకేతికతతో...ఏటీసీ టవర్‌, టెర్మినల్‌ భవనం, రాత్రిళ్లు విమానాలు దిగే సమయంలో విద్యుత్తు టవర్లు గుర్తించేలా...ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అన్ని పనులూ పూర్తవడంతో విమానాశ్రయ టెర్మినల్‌ భవనాన్ని..సీఎం జగన్‌ నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు...ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న సీఎం...మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ప్రారంభిస్తారు. ప్రత్యేక పోస్టల్‌ స్టాంపులు ఆవిష్కరిస్తారు. 12 గంటల 45 నిమిషాలకు తిరుగుపయనమవుతారు.