మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2016 (20:27 IST)

చంద్రబాబు గారు మళ్లీ వెన్నుపోటు పొడిచారు... ఎవరికో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి

ఏలూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరీ ఏలూరులో వాడిగా వేడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువత భేరీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ లీడర్లు మోసం చేశ

ఏలూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరీ ఏలూరులో వాడిగా వేడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువత భేరీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ లీడర్లు మోసం చేశారని విమర్శించారు. హోదాపై పూటకో మాట మార్చిన చంద్రబాబు తెలుగు ప్రజలకే వెన్నుపోటు పొడిచార‌ని అన్నారు. 
 
పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పటి నుంచి జరిగిన అంశాల్ని జగన్ వివరించారు. ఏపీకి పరిశ్రమలు రావాలంటే, హోదా తప్పసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు పెరుగెత్తుకు రావాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని అన్నారు. అందుకోసం తెలుగుదేశం, బీజేపీ లీడర్లను నిలదీయాలని పిలుపునిచ్చారు.