1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2016 (17:37 IST)

ప్రత్యేక హోదాపై తప్పుదోవ పట్టిస్తున్న అరుణ్ జైట్లీ : జైరాం రమేష్ ధ్వజం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సభను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 14వ ఆర్థిక సంఘం పేరుతో ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారన్నారు. 
 
వాస్తవానికి 14వ ఆర్థిక సంఘం చేతిలో ఏమీ లేదనీ, ఉండేదంతా ప్రభుత్వం చేతిలోనే అని చెప్పారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు. దేశంలో 'ఇప్పటికే 11 రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి ఉన్నాయి. 2015లో 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాలో ఉండగా... 6 రాష్ట్రాలు కాంగ్రెస్‌ పాలనలోనే ఉన్నాయి. విభజన జరిగి రెండేళ్లయినా మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న హామీలు అమలు చేయడంలో విఫలమైంది' అని ఆయన విమర్శించారు.