ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2024 (22:08 IST)

పోలవరం.. విభజన కంటే జగన్‌తో రాష్ట్రానికి ఎక్కువ నష్టం: చంద్రబాబు

Chandra babu
Chandra babu
పోలవరం ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెడగొట్టారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విభజన కంటే జగన్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 
 
పోలవరం ప్రస్తుత పరిస్థితిని చూసి కుంగిపోయానన్నారు. ప్రజలందరికీ రక్షగా ఉండే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు జగన్ శాపమని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయిందని, జగన్ హయాంలో 3.84 శాతం పనులు మాత్రమే జరిగాయని చంద్రబాబు అన్నారు. రూ.3,385 కోట్లను జగన్ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 
 
టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు ఎన్నో ప్రశంసలు వచ్చాయి. వైసీపీ పాలనలో ఐఐటీ, పీపీఏ నిపుణుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.