1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. KA Paul fire on Pawan Kalyan, Chandrababu over MLC Ticket not alloted to SVSN Varma

టీడీపీ కూటమి సర్కారు చాప్టర్ క్లోజ్... ఈ సారి వచ్చేది ప్రజాశాంతి పార్టీనే : కేఏ పాల్

ka paul
ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన కేవలం తొమ్మి నెలలకే చాప్టర్ క్లోజ్ అయిందన్నారు. అంతా అవినీతిమయం.. అంతా విఫలమయ్యారని స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ దఫా వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీ మాత్రమే అని ఆయన జోస్యం చెప్పారు. 
 
పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడంపై కేఏ పాల్ స్పందించారు. తాము చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశారని, ఎమ్మెల్సీ తన అన్న నాగబాబుకు ఇచ్చుకున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో నువ్వు పోటీ చేయకుండా పవన్‌కు సహకరించు అని వర్మకు చెప్పారని, ఎమ్మెల్సీ నీకే ఇస్తామని దేవుడు సాక్షిగా హామీ ఇచ్చారని కేఏ పాల్ వివరించారు. 
 
ఆ వర్మ ఏమో.. అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అంటూ అమరావతిలో పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు. బుద్దుందా వర్మా... వాళ్లు మాట నిలబెట్టుకోరని అపుడే చెప్పాను కదా. పిఠాపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే దొరబాబు అట.. ఈ మధ్యనే జనసేన పార్టీలో చేరారన్నారు. 
 
నాకర్థం కావడంలేదు.. మీకు బుద్ధి, బుర్రా ఉన్నాయా? ఇదే పవన్ కళ్యాణ్, చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ వందల, వేల కోట్లు వసూలుశారని ఆయన ఆరోపించారు. వీరివల్ల కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు. అదే ప్రజారాజ్యం ఇపుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెబుతున్నారు. అంటే దానర్థం ఏమిటి.. అదే పాలసీతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ మేం వందలు, వేల కోట్లు దోచుకుంటాం. మా కుటుంబం మాత్రం పదవులు అనుభవిస్తాం అంటున్నారు. తెలివైన వాడు ఎవడూ జనసేన పార్టీలో చేరర. మూర్ఖులు మాత్రమే అందులో చేరుతారు అని పేర్కొన్నారు. 
తర్వాతి కథనం
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకే పార్టీలో చేరాను : విజయశాంతి