పరమాన్నంలో మత్తుమందు పెట్టి బురిడీ కొట్టించిన దొంగబాబా అరెస్టు!
ఇంట్లో శాంతిపూజలు చేస్తా, రూపాయి నోట్లు రెట్టింపు చేస్తానంటూ పలువురిని బురడీ కొట్టించే దొంగబాబాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. భక్తుల విశ్వాసాన్ని ఆసరాగా చేసుకుని పలువురిని మోసం చేశాడు. అయితే, హైదరాబాద్ లైఫ్‌స్టైల్ బిల్డింగ్ యజమాని విషయంలో బోల్తా కొట్టాడు. ఫలితంగా పోలీసులకు చిక్కాడు. ఈ వివరాలను పరిశీలిస్తే..
హైదరాబాద్ రాజధాని నగరంలో పేరొందిన లైఫ్‌స్టైల్ తదితర బిల్డింగులు నిర్మించిన ప్రముఖ రియల్టర్ మధుసూదన్ రెడ్డిని ఆయన కుటుంబాన్ని మోసం చేసి సుమారు రూ.1.30 కోట్లను తీసుకుని ఆ దొంగ బాబా పారిపోయిన విషయం తెల్సిందే. విషయం తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు రంగంలోకి దిగారు. మధుసూదన్‌రెడ్డి ఇంట్లో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.
వాటి ఆధారంగా కొన్ని క్లూజ్‌ను కనిపెట్టారు. ఆ తర్వాత తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో స్వామీజీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆ వెంటనే బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. బెంగళూరు నగర నేర విభాగం పోలీసుల సహకారంతో వివిధ ప్రాంతాలలో గాలింపులు సాగించారు. రాత్రి 7 గంటల తర్వాత శివస్వామిని అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.30 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌కు తరలించారు.