సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 3 జులై 2017 (15:09 IST)

రోజాను అలా అనడం బాగాలేదు... ముద్దన్నకు చెప్పండి... కేసీఆర్ వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజాను సీనియర్ తెదేపా నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించడం తమకు ఏమీ బాగాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారట. ఈ సందర్భంగా తన మంత్రివర్గ సభ్యులతో కేసీఆర్ సంభాషిస్తూ... ముద్దు కృష్ణమనాయుడు మా అందరి కంటే సీనియ

ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే రోజాను సీనియర్ తెదేపా నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించడం తమకు ఏమీ బాగాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారట. ఈ సందర్భంగా తన మంత్రివర్గ సభ్యులతో కేసీఆర్ సంభాషిస్తూ... ముద్దు కృష్ణమనాయుడు మా అందరి కంటే సీనియర్. 
 
తాము కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టినపుడు ఆయన నుంచి తాము కొన్ని విషయాలు నేర్చుకున్నామనీ, అలాంటిది ఇప్పుడు ఆయన రోజా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగినది కాదంటూ కేసీఆర్ అన్నారు. అంతేకాదు.... ముద్దన్నకు ఈ విషయాన్ని మీరు చెప్పండి అంటూ కడియం శ్రీహరికి చెప్పారట కేసీఆర్. దాంతో కడియం ఫోన్ చేసి ఈ విషయాన్ని చెబితే... ప్రత్యర్థుల అసత్యపు ప్రచారంపై తాము మాట్లాడక తప్పదని వ్యాఖ్యానించారట. కాబట్టి రోజాను విమర్శించకుండా గాలి వుండలేరన్నమాట.