మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 సెప్టెంబరు 2020 (21:20 IST)

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో వస్తే.. కొత్త పార్టీ పెడతారేమో?: నాని

నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడంతోపాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, ఆయనకు భవిష్యత్తు బాగుంటుందని, కాకపోతే ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చేందుకు ఇంకా సమయం వుందని నాని చెప్పుకొచ్చారు.
 
అయితే ఆయన ఎంట్రీ టిడిపిలో ఉంటుందా లేక కొత్త పార్టీ పెడతారా అనే విషయం ఇప్పట్లో చెప్పలేమని, పరిస్థితులను బట్టి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అప్పటికీ చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతారని తెలిపారు. 
 
ప్రస్తుత రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ నెగ్గుకు రావాలంటే గట్టిగానే కష్టపడాలన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల్లో మరింత బలం పెంచుకోవాలని, అప్పుడే ఆయన సక్సెస్ అవుతారని నాని చెప్పుకొచ్చారు. కాకపోతే తప్పనిసరిగా ఎన్టీఆర్ రాజకీయ ఎదుగుదలకు లోకేష్ అడ్డుపడతారని, ఇది అందరికీ తెలుసునని చెప్పారు. 
 
చంద్రబాబు వంశం మంచిది కాదని, టీడీపీ వాళ్లు కూడా వైసీపీకి ఓటు వేసి లోకేష్‌ను తప్పనిసరిగా ఓడిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా తాను చివరి వరకు జగన్‌తోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు.