శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (15:33 IST)

గంజాయి స్మగ్లింగ్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన కూకట్‌పల్లి

గంజాయి స్మగ్లింగ్‌కు కూకట్‌పల్లి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కూకట్‌పల్లిలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. 
 
పాన్‌ షాపులు, హోటళ్లు, కిరాణ షాపుల్లో గంజాయి విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయన్నా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం. 
 
దాదాపు 150 షాపులపై పోలీసులు దాడులు చేసి పెద్దమొత్తంలో గంజాయి సిగరెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 57 మందిని అరెస్టు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.