హే భగవాన్! పైన దేవుడి బొమ్మలు..లోపల గంజాయి!
గంజాయి రవాణాకు దేముడిని కూడా విడిచిపెట్టడం లేదు స్మగ్లర్లు... పైన దేవుళ్ల చిత్రాలతో కూడిన పెట్టెలు పెట్టి, వాటి లోపల గుప్పుమనే గంజాయి అమర్చి గుట్టుగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
తమిళనాడుకు చెందిన సెల్వం, రౌతులపూడి మండలం శంఖవరానికి చెందిన గాది వెంకటరమణతో కలిసి ప్యాసింజర్ ఆటోలో గంజాయి తరలిస్తుండగా, ఇలా పట్టుకున్నారు. వారేదో దేముడి పటాలు అమ్ముకునే వాళ్ళలా బిల్డప్ ఇచ్చి... చివరికి అందులో గంజాయి పెట్టి అమ్మేస్తున్నారని తెలుసుకోవడం ఎవరికైనా కష్టమే.
కానీ, ముందుగా అందుకున్న సమాచారం మేరకు కిర్లంపూడి మండలం బూరుగుపూడి హైవేపై పోలీసులు తనిఖీ చేసి ఈ దేముడి ఫోటోలను పట్టుకున్నారు. అందులో మొత్తం 122.7కిలోల గంజాయిని నింపారని తెలిపి పోలీసులు సైతం హతాశులయ్యారు. నిందితుల నుంచి 30వేల నగదు, మొబైల్ ఫోన్, ప్యాసింజర్ ఆటో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.