ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 ఆగస్టు 2021 (17:22 IST)

ఒడిశాలో 2100 కిలలో గంజాయి పట్టివేత, 26 మంది అరెస్ట్

ఒడిశాలోని గజపతి పోలీసులు భారీ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. ఆర్ ఉదయగిరిలో ఏడుగురు మహిళలతో సహా 26 మందిని అరెస్టు చేశారు. ఆపరేషన్ సమయంలో, పోలీసులు రూ .1.5 కోట్ల విలువైన 2100 కిలోల గంజాయి (21 క్వింటాళ్లు) స్వాధీనం చేసుకున్నారు.
 
పక్కా సమాచారం అందుకున్న ఆర్. ఉదయగిరి పోలీసులు గజపతి ఎస్పీ నేతృత్వంలో పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో, పోలీసులు 4 వాహనాలను తనిఖీలు చేసారు. వాటిలో 21 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
 
 నిషేధిత గంజాయిని పంజాబ్, హర్యానాకు రవాణా చేస్తున్నట్లు తేలింది. అరెస్టయిన వారిలో నలుగురు వాహన డ్రైవర్లు రాయగడ జిల్లా పరిధిలోని పద్మాపూర్ ప్రాంతానికి చెందిన వారు కాగా, ఇతరులు పంజాబ్ మరియు హర్యానాకు చెందినవారు.