జీవితంపై విరక్తి కలిసి టెక్కీ ఉద్యోగిని సూసైడ్
సికింద్రాబాద్ నగరంలో ఓ టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి ఈ దారుణానికి పాల్పడింది. సికింద్రాబాద్ పరిధి కార్ఖానా సమీపంలోని కాకాగూడలో నివాసముండే పామర్తి వెంకటేశ్వర్లు కుమార్తె భవానీ(26) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
ఈమెకు గత 2018లో గాజులరామారం పరిధిలోని ఉషోదయ కాలనీ శ్రీసాయినివాస్‌లో నివాసముండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చారపు మాధవ్(31)తో వివాహమైంది. వీరికి ఇంకా సంతానం లేదు. అయితే, కొంత కాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈనెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవానీ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తలుపులు వేసి ఉండటంతో బయట నుంచి వచ్చిన భర్త చూడగా భవాని ఉరేసుకుని కనిపించింది.
వెంటనే బావమరిది దుర్గాప్రసాద్‌కు ఫోన్‌చేసి భవానీని కిందకు దింపారు. అప్పటికే మృతిచెంది ఉండటంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.