1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (15:20 IST)

పొలంలో వజ్రం.. రెవెన్యూ అధికారులు పట్టించుకోరట..!

అదృష్టం అంటే ఆ రైతుదే.. పంటలు పండక, గిట్టుబాటు ధర రాక దిగాలుగా ఉన్న రైతు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంకు చెందిన రైతు పంట పండింది. ఏకంగా మూడు కోట్లు విలువ చేసే వజ్రం సాగు భూమిలో లభ్యం అయింది. 
 
రహస్యంగా వ్యాపారి వద్దకు తీసుకెళ్లడంతో 30 క్యారెట్ల వజ్రమని తేలడంతో రైతుతో బేరసారాలు ఆడి కోటి 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్కెట్లో దీని ధర రూ.2 నుంచి రూ.3కోట్ల వరకు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
 
అంత సొమ్ము ఒక్కసారి చూసిన అన్నదాత దక్కిందే అదృష్టంగా భావించి ఇతరులకు తెలియజేయలేదని, వ్యాపారి సైతం గుట్టుగా ఉంచే ప్రయత్నం చేసారు. చివరకు ఆ నోటా ఈ నోటా పడి బయటపడ్డ విలువైన వజ్రం విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.
 
సాధారణంగా ఈ ప్రాంతంలో వజ్రాలు దొరికితే స్థానిక వ్యాపారులందరికీ సమాచారమిచ్చి వేలం పాటలో అమ్ముతారు. కాని తొలకరికి ముందే, అదీ.. ఇంత విలువైన వజ్రం దొరకడం మొదటిసారని స్థానికులు చెబుతున్నారు.
 
కోట్లు విలువ చేసే విలువైన వజ్రాలను అక్కడి వ్యాపారస్తులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇంత భారీ మొత్తంలో వజ్రాలు దొరికిన అక్కడి రెవెన్యూ అధికారులు దరిదాపులకి కూడా వెళ్లరట.