శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 మే 2021 (10:31 IST)

తెలుగు రైతుకు వజ్రం రూపంలో వరించిన అదృష్టం

ఓ తెలుగు రైతుకు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. దీంతో ఆ రైతు రాత్రిక రాత్రే కోటీశ్వరుడైపోయాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చిన్నజోన్నగిరి ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతు గురువారం పొలం పనులు చేసుకుంటుండగా.. అతడికి విలువైన వజ్రం లభించింది.
 
ఈ విషయం తెలుసుకున్న వజ్రాల వ్యాపారాలు ఆ అన్నదాత ఇంటికి క్యూ కట్టారు. ఇక దాన్ని సీక్రెట్‌గా వేలం వేయగా.. గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇదిలావుంటే మార్కెట్‌లో ఆ వజ్రం ధర ఏకంగా రూ.3 కోట్లకు పైగా ఉంటుందని వజ్రవ్యాపారులు అంచనా వేస్తున్నారు.
 
కాగా, గతంలోనూ జొన్నగిరికి చెందిన వ్యక్తికి రూ.37 లక్షల విలువైన వజ్రం లభ్యమైనట్లు గ్రామస్తులు తెలిపారు. ఏటా తొలకరి జల్లులకు ఈ ప్రాంతంలో చిన్నా, పెద్ద వజ్రాలు దొరుకుతాయని స్థానిక ప్రజలు చెబుతుంటారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అక్కడి ప్రజలు వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటారు.