ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2023 (10:38 IST)

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆవరణలో చిరుత

leopard
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో చిరుతపులి కనిపించింది. దీంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. చిరుతపులి ఉన్నట్టు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో యూనివర్శిటీ భద్రతా సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అలిపిరిలో చిరుత సంచారం శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 
 
ఇలా తిరుమల అలిపిరి మెట్లపై భక్తులకు చిరుతలు కనిపిస్తున్న వేళ.. యూనివర్శిటీ క్యాంపస్‌లో చిరుతపులి కనిపించడం దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు తిరుమలలోని నడకదారిలో చిరుతపులి కనిపించడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా 2450వ మెట్టు వద్ద సోమవారం చిరుతపులి కనిపించింది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి భక్తులకు భద్రత కల్పించారు.