సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2019 (19:36 IST)

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు పెంపు..?

రాష్ట్రంలో మద్యం ప్రియుల జేబుకు చిల్లులు పడనున్నాయి. త్వరలో ధరలు పెంచడం ద్వారా అధిక రాబడి ప్రభుత్వ ఖజానాలో జమ కానుంది.

మున్సిపల్ ఎన్నికల తర్వాత ధర పెంచేందుకు అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పుడున్న ధరలకు 15శాతానికి తక్కువ కాకుండా పెంచాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా మరింత రాబడిని ఖజానాకు జమ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

ఇప్పటికే రాష్ట్రంలో మద్యం విక్రయాలు, లైసెన్సుల జారీ, దరఖాస్తుల విక్రయం, ప్రత్యేక ఎక్సైజ్ పన్ను, ప్రివిలేజ్​ టాక్స్ తద్వారా గత ఏడాది ఇరవై ఒక్క వేల కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి మరో ఐదువేల కోట్లు మద్యం విక్రయ ద్వారా ఆర్జించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది.

అందుకోసం 15 నుంచి 25% వరకు మద్యం ధరలు పెంచాలని అబ్కారీ శాఖ యోచిస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు లోతైన అధ్యాయనం చేస్తున్నారు.