1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2016 (12:48 IST)

జ్ఞానసాయికి కాలేయ శస్త్రచికిత్స విజయవంతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కారుణ్య మరణం కథ సుఖాంతమైంది. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె గ్రామానికి చెందిన ఎనిమిది నెలల చిన్నారి జ్ఞానసాయికి చెన్నైలో నిర్వహించిన కాలేయ శస్త్రచికిత్స విజయవంతమైంది. 
 
గ్లోబల్‌ ఆసుపత్రికి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ డిసీజ్‌ అండ్‌ ట్రాన్స్ ప్లాంటేషన్‌ విభాగం చిన్నారికి చికిత్స చేసింది. చిన్నారి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వమే భరించింది. తండ్రి కాలేయాన్ని చిన్నారికి అమర్చి శస్త్రచికిత్స నిర్వహించారు.