మదనపల్లె జంట హత్య కేసు.. అలేఖ్యకు ప్రియుడున్నాడా.. పరువు హత్యేనా?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా అలేఖ్య, సాయి దివ్యల పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు వెలుగుచూశాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పెంపుడు కుక్కతో ఉన్న అలేఖ్య ఫొటో ప్రత్యక్షమైంది. దీంతో అలేఖ్యకు ప్రియుడు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
పరువు కోసమే ఈ జంట హత్యలు జరిగాయంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే అలేఖ్య, సాయి దివ్యల తల్లిదండ్రుల మానస్థిక స్థితి బాగోలేదు. వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
వారు కోలుకునేవరకు ఏం జరిగిందో బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఇంతలోనే అలేఖ్యకు ప్రియుడు ఉన్నాడంటూ వార్తలు రావడంపై పోలీసులు మండిపడుతున్నారు. కొంతమంది ఫేమస్ కావడం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
జంట హత్యల అనంతరం అరెస్టైన పురుషోత్తంనాయుడు, పద్మజలను పోలీసులు మదనపల్లెలోని సబ్ జైలుకు తరలించారు. ఐతే అక్కడ పద్మజ తన వింత ప్రవర్తలనో సాటి ఖైదీలకు పిచ్చెక్కింటింది. తాను శివుడ్నని, కాళికా దేవినంటూ తన చుట్టూ తానే తిరుగుతూ కిందపడిపోవడం, అర్ధరాత్రి పూట కేకలు వేస్తూ ఖైదీలను భయభ్రాంతులకు గురిచేసింది.
ఆమెను వేరే బ్యారక్‌లో ఉంచడానికి పోలీసులు యత్నించినా.. అందరితో కలిసుంటానిని వాదించడం, తీరా మహిళా ఖైదీల బ్యారక్ లో ఉంటితే కేకలు వేయడం ఇలా పది రోజుల నుంచి జైలు అధికారులకు చుక్కలు చూపించింది పద్మజ. పురుషోత్తంనాయుడు మాత్రం సాధారణంగానే ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో పురుషోత్తంనాయుడు, పద్మజలను మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం తరలించారు. నిందితులిద్దరి మానసిక పరిస్థితిపై తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యులు సరైన నిర్ణయానికి రాలేకపోవడం, వారికి వచ్చిన మానసిక సమస్య ఏంటనేది స్పష్టంగా లేకపోవడంతో విశాఖలోని ఆస్పత్రికి తరలించారు.
వాస్తవానికి నాలుగురోజుల క్రితమే పద్మజ, పురుషోత్తంనాయుడుని విశాఖ తరలించాల్సి ఉన్నా.. ఎస్కార్ట్ విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ వాహనానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోవడంతో ఈ ఉదయం మదనపల్లి సబ్ జైలు నుంచి విశాఖపట్నం తీసుకెళ్లారు.