బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 28 ఆగస్టు 2017 (12:09 IST)

నా ఓటమికి మలేరియా కూడా ఓ కారణం... శిల్పా మోహన్ రెడ్డి

భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మె

భారీ ఆశలు పెట్టుకుని నంద్యాల ఉపఎన్నికల బరిలో నిలబడి... ఈ ఫలితం వచ్చే 2019 ఎన్నికలకు రిఫరెండం అంటూ చెప్పుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం దిశగా సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి 11వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి శిల్పాపై 20 వేల పైచిలుకు మెజారిటీతో ముందుకు సాగుతున్నారు.
 
ఈ నేపధ్యంలో శిల్పా మోహన్ రెడ్డిని విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నలు సంధించారు. మీ ఓటమికి కారణాలు ఏమిటని అడిగినప్పుడు... తెదేపా విపరీతంగా డబ్బులు పంచిందనీ, ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకూ పంచారు. అంతేకాదు... దేవాలయాలు, మసీదులు, స్మశానాలకు డబ్బు మంజూరు చేశారు. విపరీతంగా ధన ప్రవాహం జరిగింది. 
 
ఇంకా నేను మలేరియా బారిన పడి 20 రోజుల పాటు బయటకు రాలేకపోయాను. ఇది కూడా నా ఓటమికి ఓ కారణం. అంతేకాదు... భూమా నాగిరెడ్డిపై వున్న సానుభూతి కూడా పనిచేసింది. ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని విమర్శించినదేమీ ఇక్కడ పనిచేయలేదు" అని చెప్పుకొచ్చారు శిల్పా మోహన్ రెడ్డి.