ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:36 IST)

ఏజెన్సీలో కారును తగలబెట్టిన మావోయిస్టులు (Video)

car burnt
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో జాతీయ రహదారిపై వెళుతున్న అడ్డగించి, అందులోని ప్రయాణికులను కిందకు దించేసిన మావోయిస్టులు.. ఆ తర్వాత కారుకు నిప్పుపెట్టి తగలబెట్టేశారు. కారులో ఉన్న ప్రయాణికులను దింపి అనంతరం కారుకు నిప్పుపెట్టారు. 
 
ఈ నెల 2 నుంచి 9 వరకు మావోయిస్టుల వారోత్సవాలకు పిలుపునిచ్చి, విజయవంతంగా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే, ఈ వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజే మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడం గమనార్హం. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. 
 
అయితే, దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది. ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు అనే సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో జరిగినట్టు తెలుస్తుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోలేదు. ఇపుడు మళ్లీ జరగడంతో స్థానికంగా కలకలం చెలరేగింది.