గురువారం, 12 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (11:27 IST)

మోహన్ బాబు పెద్దరాయుడి పెద్దరికం మంచులా కరిగిపోతుందా?

Mohan Babu, manoj
Mohan Babu, manoj
తెలుగు సినిమాలో డిసిప్లిన్ నిదర్శనంగా ప్రత్యేకంగా చెప్పుకునే మంచు మోహన్ బాబు ఇప్పుడు కుటుంబగొడవలతో రోడ్డు ఎక్కారు. దీనితో అతని కుటుంబం సామాన్య కుటుంబతరహాలో పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు స్థాయికి చేరుకుంది. ఎన్నో సినిమాల్లో కుటుంబ సంబంధాలు, బాంధవ్యాలు, ఆస్తుల వివాదాలు, మహిళా సమస్యలను పరిష్కరించే మోహన్ బాబు పెదరాయుడులో సౌందర్యతో సాగే ఎపిసోడ్ ను ఆయన మర్చిపోయినట్లున్నాడు. అసలు మంచు ఫ్యామిలీ ఇలా రోడ్డు ఎక్కడం కొత్తేమీకాదు. సినిమావాళ్ళకు, బయట వాళ్ళకు ఎన్నో ఉదంతాలు తెలిసేలా జరిగాయి. 
 
ఇక్కడ ఓ విషయం గుర్తుకు వస్తుంది. తన గురువుగా భావించే స్వర్గీయ దాసరినారాయణరావుతో తన ఇంటి గొడవలు జరిగినప్పుడల్లా గురువుగారిని ఆశ్రయించడం పెద్దలతో పరిష్కరించడం జరిగిన సందర్భాలున్నాయి. మరి అదే దాసరినారాయణావు కుటుంబంలో ఇద్దరు కుమారులతో ఆస్తిపంపకాల గొడవలు, పెండ్లి గొడవలు కూడా పెద్ద రాద్దాంతం అయితే దానికి మధ్యవర్తిగా పరిష్కరించినవారిలో డా. మంచు మోహన్ బాబు ఒకరు. కట్ చేస్తే ఇప్పుడు అవే గొడవలు మోహన్ బాబుకు చుట్టుముట్టాయి. కానీ పరిష్కరించేందుకు దాసరిలాంటివారు లేరు. రాజకీయనాయకులుకూడా ముందుకురావడంలేదని తెలుస్తోంది. ఇందుకు కారణం మంచు మనోజ్ భార్య రాయలసీమలోని ఫ్యాక్షనిస్టు కుటుంబానికి చెందింది కావడమే కారణం.
 
అసలు మంచు కుటుంబంలో గొడవలు కొత్తేమీకాదు. మంచు విష్ణు, మోహన్ బాబు ఒకేమాటపై నిలబడతారని వార్తలు కూడా వచ్చాయి. ఇక మనోజ్, లక్మిప్రసన్న ఒకమాటపై వుంటారు. గతంలో వీరివ్యాపార వ్యవహారాలలో షేర్ లు కూడా మనోజ్ అడిగినట్లు తెలిసింది. అయితే అప్పట్లో మనోజ్ సరైన క్రమశిక్షణ లేకపోవడంతో సినిమాలు పెయిల్ కావడంతో కొంతకాలం డిప్రెసన్ కు గురయ్యాడని కూడా సన్నిహితులు తెలియజేశారు. ఆ తర్వాత మంచు విష్ణు కష్టపడి ఇంటర్ నేషనల్ స్కూల్ ను స్థాపించి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మోహన్ బాబు తిరుపతిలో స్కూల్ ను ఏర్పాటు చేసి యూనివర్శిటీ స్థాయికి తీసుకువచ్చారు. తదంతర పరిణామాలలో వాటిల్లోనూ వాటా కావాలని పట్టుబడినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కానీ ఇందుకు మంచు విష్ణు ససేమిరా అనడం, మనోజ్ ను దూరంగా పెట్టడంకూడా జరిగినట్లు కథనాలు వచ్చాయి.
 
ఆ తర్వాత చాలా కాలం దూరంగా వున్న మనోజ్ కు పెండ్లి విషయంలో కూడా గందరగోళం నెలకొంది. మోహన్ బాబు ఈ పెండ్లికి వస్తాడా? రాడా? అనేది కూడా చర్చ జరిగింది. ఫైనల్ గా మోహన్ బాబు రావడం పెండ్లి సజావుగా జరగడం జరిగింది.  అప్పటినుంచి మనోజ్ కు అదనంగా తన భార్యకున్న సెక్యూరిటీ తోడయింది. మనోజ్ కు పెండ్లి జరగడంతో ఆస్తులవాటాలపై కొద్దిరోజులు కుటుంబసభ్యులతో చర్చ జరిగినట్లు సమాచారం. 
 
అయితే తాజా సమాచారం ప్రకారం మోహన్ బాబు వ్యక్తిగత సిబ్బందికి, మనోజ్ భార్య సిబ్బందికి మధ్య తలెత్తిన వివాదం రాద్దాంతం అయిందని తెలుస్తోంది. ఆ క్రమంలో మోహన్ బాబు కఠినంగా మనోజ్ ను మందలించడంతోపాటు, తన భార్య వల్లే నిన్నసలు ఇక్కడకు తీసుకువచ్చానంటూ పరుషంగా మాట్లాడడంతో, మనోజ్ అహం దెబ్బతిని తన తల్లిని తిడతావా? అంటూ ఆవేశంగా ముందుకు వెళ్ళడంతో చేయిచేసుకునే స్థాయికి వెళ్ళిందని కథనాలు వినిపిస్తున్నాయి. 
 
అయితే ఇంత రాద్దాంతం జరిగి మనోజ్ ఆసుపత్రిలో చేరడం జరిగినా, అసలు తమ కుటుంబంలో గొడవలు జరగలేదనీ, మీడియా వారు అత్సుత్సామం చేపారనీ, అసలు నిజాలు తెలుసుకుని రాయాలని అంటూ ఓ ప్రకటన మోహన్ బాబు తన ప్రచార టీమ్ తో విడుదల చేయడం హాస్యాస్పదం.
 
అతర్వాత ఇరువురి సిబ్బంది చేయిచేసుకునే స్థాయికి చేరడంతో కథ మరో మలుపు తిరిగింది.  ఫైనల్ గా మోహన్ బాబు, మనోజ్ లు ఇరువురూ తమకు ప్రాణహాని వుందని పహాడ్ షరీఫ్ పోెలీస్ స్టేషన్ లో కేసు పెట్టేస్థాయికి చేరుకోవడం విచారకరం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఏ పెద్దమనిషి నడుం బిగిస్తాడో చూడాలి.