ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (15:49 IST)

Manchu Family Disputes 'మంచు' ఫ్యామిలీ పంచాయతీ ఏంటి..?

mohan babu - manoj
Manchu Family Disputes తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్‌ల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆస్తుల పంపకాల విషయంలో మంచు ఫ్యామిలీలో ఈ గొడవలు ఉత్పన్నమైనట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఇపుడు చిత్రపరిశ్రమతో పాటు మంచు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
పహాడీషరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్ ఇతర బౌన్సర్లు మనోజ్‌, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు.. గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఈ విషయమై మహేశ్వరం డీసీపీని సంప్రదించగా డయల్-100కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఇదిలావుంటే, కాలుకు గాయం అయిన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలసి బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు. కాగా, మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జి అయ్యారు. మనోజ్‌కు మెడికో లీగల్ కేసు పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
 
ముఖ్యంగా, కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది. సిటీ స్కాన్, అల్ట్రా సౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషనులో ఉండాలని సూచించగా.. సోమవారం మరోసారి ఆస్పత్రికి వస్తానని మనోజ్ డిశ్చార్జి అయినట్లు తెలిసింది. మరోవైపు, తమ కుటుంబంలో గొడవులు జరిగినట్టు మీడియాలో వస్తున్న వార్తలను  మోహన్ బాబు ఖండించారు.