ప్రచారం కోసమే ఎంపీ శివప్రసాద్ బుర్రకథ...
చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్. ఈ పేరు చాలామందికి తెలియకపోయినా వెరైటీ ఎంపి ఎవరంటే మాత్రం ఠక్కున ఎవరైనా సమాధానం చెప్పేస్తారు. తెలుగుదేశం పార్టీ ఎంపిగా ఉన్న శివప్రసాద్‌కు ప్రజా సమస్యలపై ముందు నుంచే వెరైటీగా నిరసనలు చేపట్టడం అలవాటు. అసలు శివప్ర
చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్. ఈ పేరు చాలామందికి తెలియకపోయినా వెరైటీ ఎంపి ఎవరంటే మాత్రం ఠక్కున ఎవరైనా సమాధానం చెప్పేస్తారు. తెలుగుదేశం పార్టీ ఎంపిగా ఉన్న శివప్రసాద్‌కు ప్రజా సమస్యలపై ముందు నుంచే వెరైటీగా నిరసనలు చేపట్టడం అలవాటు. అసలు శివప్రసాద్ ఎప్పుటి నుంచో ఇలాంటి నిరసనలు చేస్తూనే ఉన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం. ఈ పేరు వింటేనే అందరికీ అర్థమైపోతుంది. రాష్ట్రం మొత్తం ఏ విధంగా స్థంభించిపోయిందో. ఈ ఉద్యమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆందోళనలు తెలిపినా ఎంపి శివప్రసాద్ మాత్రం వెరైటీగా తన వాణిని వినిపించారు. విచిత్ర వేషధారణలతో ఢిల్లీ పార్లమెంటు ముందు నిలబడి నిరసన తెలిపిన శివప్రసాద్ ఒక్కసారిగా జాతీయ ఛానల్‌లో అట్రాక్షన్‌గా నిలిచాడు. అప్పటివరకు శివప్రసాద్ ఎవరో తెలియని ప్రజలు ఆ వేషాలను చూసి ఆశ్చర్యపోయారు.
చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న శివప్రసాద్‌కు టీవీల్లో కనిపించడమంటే చాలా ఇష్టం. అందుకే ఇలాంటివి చేస్తున్నారని ఎంతోమంది విమర్శిస్తున్నారు. పత్రికల్లో పతాక శీర్షికల్లో, ప్రకటనల్లో ముఖ్యాంశాల్లో నిలబడాలన్నదే శివప్రసాద్ ఉద్దేశం. అందుకే తానొక కళాకారుడని, పార్టీకి సంబంధం లేదని, ప్రజలు పడే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుంటానని చెబుతుంటారు. కానీ నిన్న తిరుపతిలో శివప్రసాద్ చేసిన నిరసనపై అధినేత చంద్రబాబు కోపంతో ఉన్నట్లు సమాచారం. ప్రచారమేమోగానీ, అధినేత ఆగ్రహాన్ని ఏ విధంగా శివప్రసాద్ చవిచూస్తారేమోనన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.