మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (13:10 IST)

భార్య చేపల కూర వండలేదని ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

మద్యం మత్తులో ఉన్న ఓ భర్త తన భార్య చేప‌ల కూర వండ‌లేద‌ని అలిగి టవర్ ఎక్కాడు. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో గల లింగాల మండలం కోమటికుంట గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడికి బ‌ల్మూర్‌కు చెందిన మ‌హిళ‌తో పెళ్ల‌య్యింది. అత‌డు ప‌ది రోజుల క్రింద‌ట అత్త‌గారి ఊరు అయిన బ‌ల్మూర్‌కు వ‌చ్చాడు. అక్క‌డ త‌న భార్య‌ను చేప‌ల కూర వండ‌మ‌ని అడిగాడు. 
 
సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చిన న‌రేష్ చేపల కూర వండ‌మ‌న్నా ఎందుకు వండ‌లేదంటూ భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. భార్య చేప‌ల కూర వండేందుకు నిరాక‌రించ‌డంతో అత‌డు అలిగి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. అక్క‌డ నుంచి మ‌ద్యం మ‌త్తులో సెల్ టవర్ ఎక్కాడు. 
 
విషయం తెలుసుకున్న ఎస్ఐ వీరబాబు అక్కడికి వెళ్లి కోమటికుంట సర్పంచ్ బచ్చన్నను కూడా అక్క‌డ‌కు పిలిపించాడు. స‌ర్పంచ్‌తో పాటు అక్క‌డున్న గ్రామపెద్ద‌లు అత‌డికి న‌చ్చ చెప్ప‌డంతో గంట‌న్న‌ర త‌ర్వాత అత‌డు ట‌వ‌ర్ దిగి రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.