నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు- స్పెషల్ అట్రాక్షన్‌గా దేవాన్ష్ (video)
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్, ఇతర బంధువులు నారావారిపల్లెలో సందడి చేస్తున్నారు. భోగి పండుగ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన పోటీల్లో నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు.
గోనె సంచిలో కాళ్లు ఉంచి... దుముకుతూ వెళ్లే ఆటలో దేవాన్ష్ పార్టిసిపేట్ చేశాడు. ఈ పోటీని దేవాన్ష్ ఎంతగానో ఆస్వాదించాడు. ఈ పోటీలను సీఎం చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు కూడా తిలకించారు. విజేతలకు వారు బహుమతులు అందించారు.
మరోవైపు మహిళలకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు పలు ఆటల పోటీలను నిర్వహించారు. భువనేశ్వరి, బ్రాహ్మణి మహిళలు వేసిన ముగ్గులను వీక్షించారు. ముగ్గుల పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొనగా వారందరికీ 10 వేల 116 రూపాయల చొప్పున నగదు బహుమతిని భువనేశ్వరి అందజేశారు.