బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 నవంబరు 2024 (15:43 IST)

తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Video)

karmakriyalu
తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నారా రామ్మూర్తినాయుడు ఈ నెల 16వ తేదీన అనారోగ్యం కారణంతో మృతి చెందిన విషయం తెల్సిందే. హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించారు. 
 
ఆయన దశదిన కర్మక్రతువులను గురువారం నిర్వహించారు. చంద్రబాబు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో జరిగాయి. ఇందులో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్, కుటుంబ సభ్యులతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ ఈ కర్మక్రియలను నిర్వహించారు.