అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం (నవంబర్ 29) ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లాలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ నుంచి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. భారీ బహిరంగ సభలో కూడా ప్రసంగించనున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ రాబోతోంది.
1,600 ఎకరాల్లో నిర్మించనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ పవర్‌హౌస్‌గా మారుస్తుందని, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మారుస్తుందని భావించారు.
ఈ ప్రాంతానికి చెందిన బీజేపీ నేతలు కూడా ప్రధానికి ఘనంగా స్వాగతం పలికేందుకు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. శంకుస్థాపన, బహిరంగ సభకు సన్నాహాలు ముమ్మరం చేశారు.