శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 27 మే 2017 (13:43 IST)

విశాఖలో మహానాడు.. మదర్ థెరిసాతో నారా లోకేష్‌ను పోల్చేశారు.. భజన చేయాలిగానీ?

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. మహానాడును పురస్కరించుకుని తమ అభిమాన నేతల పోస్టర్లను టీడీపీ కార్యకర్తలు మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లు కాస్

విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ తలపెట్టిన మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. మహానాడును పురస్కరించుకుని తమ అభిమాన నేతల పోస్టర్లను టీడీపీ కార్యకర్తలు మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లు కాస్త శ్రుతిమించాయని టాక్ వస్తోంది. సినీ హీరోలపై ఫ్యాన్స్ రకరకాలుగా తమ అభిమానాన్ని తెలియజేసే పనులు చేస్తుంటారు. ప్రస్తుతం అదే సీన్ రాజకీయాల్లోకి కూడా వచ్చేసింది. 
 
వైజాగ్ మహానాడు సందర్భంగా మంత్రి, ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ను మధర్ థెరిస్సాతో పోల్చారు కార్యకర్తలు. లోకేష్ సేవా భావం మదర్ థెరిస్సాలా ఉందని ఆ పోస్టర్ ద్వారా చెప్పారు. అంతేకాదు.. మదర్ థెరిస్సాకు మించి నారా లోకేష్ సంక్షేమ కార్యక్రమాలను చేస్తున్నారనే అర్థం వచ్చేలా ప్లెక్సీలు కట్టారు. మహానాడు సందర్భంగా వైజాగ్ పచ్చతోరణాలతో కళకళలాడుతోంది. 
 
అదే సమయంలో లోకేష్‌ను అవసరానికి మించి ఆకాశానికెత్తుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. నేతలకు భజన చేయాలిగానీ.. మరి ఇంతగా చేయాలా అనే చర్చ సాగుతోంది. మదర్ థెరిస్సా జనహితంగా చేస్తే లోకేష్ కార్యకర్తల కోసం సేవలందిస్తున్నారనే ట్యాగ్ లైన్లు రాశారు. 
 
ఇంకా ఫ్లెక్సీలపై సీఎం చంద్రబాబుకు తర్వాత లోకేషే సీఎం అనేంత స్థాయిలో కార్యకర్తల ప్రచారం జరుగుతోంది. అయితే దొడ్డిదారిన మంత్రి పదవిని దక్కించుకున్న నారా లోకేశ్‌ను సేవకు మారురూపమైన మదర్ థెరిసాతో పోల్చడం ఏమిటని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.